Tuesday, September 16, 2025

నందమూరి తారకరత్నకి” నివాళులర్పించిన బత్యాల

నందమూరి ముద్దుబిడ్డ “తారకరత్న* గారి మరణాన్ని చింతిస్తూ నేడు 19-02-2023వ తేదీ ఆదివారం నాడు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని బైపాస్ లో ఉన్న పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద తారకరత్న గారి చిత్రపటానికి పూలమాల వేసి టీడీపి కుటుంబసభ్యులతో కలసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తారకరత్న గారు యువగళం ప్రారంభోత్సవం రోజు జనవరి 27వ తారీఖున చాలా చురుగ్గా అందరితో కలిసిమెలిసి మాట్లాడుకుంటూ

కుప్పంలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామి గుడి వద్ద నేను చూశానని., ఆయన ప్రజలతో చాలా బాగా కలిసిపోయే వ్యక్తని అలాంటి వ్యక్తి కి ఇలా జరగడం నన్ను చాలా ఆవేదనకు గురి చేసింది.

*ఆయన మృతి చెందడం తెలుగుదేశం పార్టీకి, సినీ పరిశ్రమకు మరియు ఆయన అభిమానులకు తీరని లోటు ఆయన సినిమాల్లోనే కాకుండా పార్టీ కార్యక్రమాలో కూడా చురుగ్గా పాల్గొనేవారిని.

అలాంటి వ్యక్తిని ఈరోజు మనం కోల్పోవడం చాలా శోక సంద్రానికి గురిచేసింది ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు

రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తరఫున, నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular