కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ప్రముఖ దేవస్థానం దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి గుడిలో బుధవారం హుండీ లెక్కింపును నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాల మేరకు దేవరగట్టు ఆలయ చైర్మన్ వీర నాగప్ప దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత నాలుగు నెలలకు సంబంధించిన భక్తుల హుండీ కానుకల లెక్కింపులో రూ.7.20 లక్షల నగదు, 20 గ్రాముల వెండి లభించాయని తెలిపారు. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా, దుబాయ్ సహా విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో లభించాయని చెప్పారు.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ లోక్యానాయక్, కమిటీ సభ్యులు, నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. భక్తుల సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు నిర్వహించారని అధికారులు తెలిపారు.
కార్యక్రమం సందర్భంగా హొళగుంద ఎస్ఐ దిలీప్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.



