Monday, April 7, 2025

దుమ్ముగూడెం మండలంలో సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ

భద్రాచలం నియోజకవర్గం | 04-04-2025



దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మినగరం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు  పాల్గొని, తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రతిపాదిస్తూ, బాలల బుద్ధివృద్ధికి మరియు విద్యాభివృద్ధికి సరస్వతీదేవి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular