భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
📍 దమ్మపేట, తేది: 04.10.2025
దమ్మపేట మండలంలోని లింగాలపల్లి గ్రామంలో తెలంగాణ ఆయిల్ ఫీడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ రైతు సదస్సు ఘనంగా జరగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బూర్గంపహాడ్, అశ్వారావుపేట నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ తొలి టైగర్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు, హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేకమంది సన్న, చిన్నకారు రైతులు పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల పామాయిల్ సాగు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పాస్ పుస్తకం లేకుండానే మొక్కలు అందించే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరినట్టు తెలిపారు.
కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు, ఆయిల్ ఫీడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, మద్దినేని వెంకట్ తదితరులు పాల్గొన్నారు. వారిని నిర్వాహకులు శాలువాలతో సన్మానించారు.
అదేవిధంగా, అశ్వారావుపేట మాజీ జెడ్పిటిసి అంకిత మల్లికార్జున రావు, వినాయకపురం మాజీ సర్పంచ్ పొట్ట రాజులు, కన్నమ్మగారు ఇతర నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సదస్సు ద్వారా పామాయిల్ సాగు పట్ల రైతుల్లో అవగాహన పెరిగినట్టు గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.




