Tuesday, December 2, 2025

తేజ న్యూస్ కథనానికి స్పందించిన జిల్లా బాస్

TEJANEWSTV TELANGANA :

తేజ న్యూస్ కథనానికి స్పందించిన జిల్లా బాస్.

లంచాలు తీసుకునే కోర్టు కానిస్టేబుల్ పై పడనున్న వేటు.

పూర్తిగా ఎంక్వయిరీ దిశగా అడుగులు.

రేపటి నుండే ఎంక్వయిరీ ప్రారంభం.

ఎంక్వయిరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ.

నేరుగా ముద్దాయిలతోనే జిల్లా బాస్ మాట్లాడబోతున్నట్టుగా వీస్తున్న న్యాయపవనాలు.

తేజా న్యూస్ టీవీ
ములుగు జిల్లా.

ములుగు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కోర్టు కానిస్టేబుల్ ల అక్రమ జరిమానాల పర్వం నేపథ్యంలో ఇటీవల తేజ న్యూస్ లో ప్రచురితమైన (లంచాల వలయంలో మునిగితేలుతున్న జిల్లాలోని కొందరు కోర్టు కానిస్టేబుళ్లు )అనే కథనానికి జిల్లా బాస్ స్పందించారు.
కోర్టు కానిస్టేబుల్ ల బారిన పడిన ముద్దాయిలను  నేరుగా జిల్లా బాస్  కలవనున్నట్లు న్యాయ పవనాలు వీస్తున్నాయి.
కాగా గత కొన్ని ఏళ్లుగా కోర్టు కానిస్టేబుల్ ల వసూళ్ల పర్వానికి తేజ న్యూస్ కథనం ఒక చెంపపెట్టు లాంటిది అంటూ వసూళ్ల బారిన పడిన పలు మండలాలలోని ముద్దాయిలు ఫోన్లు చేసి మరి వారి పరిస్థితిని వివరించడం విశేషం.
కొంతమంది లాయర్లు కూడా కోర్టు కానిస్టేబుల్ ల వసూళ్ల పర్వాన్ని నిలదీసే వార్తను అందించినందుకు తేజ న్యూస్ పాత్రికేయుడికి అభినందనలు తెలుపుతున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఏ మేరకు   కోర్టు కానిస్టేబబుల్స్ ముద్దాయిల వద్ద దండుకున్నారో వేరే చెప్పనవసరం లేదు.
ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఊరటనిచ్చిన కోర్టు కానిస్టేబుల్ వసూళ్ల పర్వం అనే కథనం కొంతమేర ప్రజలకు ఉత్తేజాన్ని రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 19 బావ స్వేచ్ఛని మరో మారు వారిలో అంతరించికపోయినా ప్రశ్నించే తత్వాన్ని నిద్రలేపినందుకు . అసలు సిసలైన పత్రిక విధివిధానాన్ని  నిలబెట్టిన ఖ్యాతి దక్కడం చాలా సంతోషకరమని తేజ న్యూస్ బృందం భావిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular