Tuesday, December 24, 2024

తెలుగుదేశం పార్టీ వి.ఐ.పి(VIP) డాక్టర్ గురు రాజా గారికి ఘనంగా సుస్వాగతం పలికిన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి

TEJA NEWS TV దర్శనం నిమిత్తం మంత్రాలయం నియోజకవర్గంకు వచ్చిన తెలుగుదేశం పార్టీ వి.ఐ.పి(VIP) డాక్టర్ గురు రాజా గారికి ఘనంగా సుస్వాగతం పలికిన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ గారల అత్యంత సన్నిహితుడైన డాక్టర్ గురురాజు గురువారం రోజు మంత్రాలయం నియోజకవర్గం కౌతల మండలం ఉరుకుందలో వేలసిన శ్రీ నరసింహ స్వామిని మరియు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిలను దర్శించుకోవడానికి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డిలు ఘనంగా స్వాగతం పలికి స్వామివార్ల దర్శనం కావించి గౌరవించారు.తెలుగుదేశం పార్టీ నాలుగు మండలాలు నాయకులు మరియు కార్యకర్తల మధ్యన అఖండ స్వాగతం పలికి దేవాలయాల్లో EO విజయరాజు,సూపర్డెంట్ వెంకటేష్, ప్రధాన అర్చకులు ఈరన్న స్వామి ల ఆధ్వర్యంలో  అర్చకులు ద్వారా తెలుగుదేశం పార్టీ విఐపి డాక్టర్ గురు రాజా తో పాటు స్వాములవారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆహ్వానం మేరకు వారి స్వగృహానికి విచ్చేసి వారితో పాటు విందులో ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గురు రాజాకు శ్రీ మఠం రాఘవేంద్ర స్వామి ప్రతిమను అందించారు. కార్యక్రమంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి తో పాటు ,జిల్ల యువనాయకులు ఎన్.రఘునాథ్ రెడ్డి ఎన్.రామకృష్ణరెడ్డి, నవయువ నాయకులు ఎన్.రాకేష్ రెడ్డి,  చూడి ఉలిగయ్య ,ముత్తు రెడ్డి మాజీ పల్లెపాడు రామిరెడ్డి ,తోవి రామకృష్ణ  మరియు తెలుగుదేశం పార్టీ నాలుగు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular