Wednesday, February 5, 2025

తెలంగాణ సీఎం ను కలవనున్న విద్యుత్ సబ్స్టేషన్ ఆర్టిజన్లు

తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం అధిక సంఖ్యలో తరలి వెల్లనున్నారు. ఒప్పంద కార్మికులుగా,ఉన్న మమ్మల్ని, పర్మినెంట్ చేయుట. పర్మినెంట్ ఉద్యోగులకు ఉన్నట్టుగా, అన్ని సదుపాయాలు కల్పించడం. గ్రేడ్స్ చేంజ్ చేయుట. అధిక మొత్తంలో. జీతభత్యంలో పెంచుట. అనేక సమస్యల మీద త్వరలోనే సీఎం గారిని కలుస్తామని కామారెడ్డి జిల్లా సబ్ స్టేషన్ ఆర్టిజన్, కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ నాంపల్లి ఒక ప్రకటనలో తెలియజేశారు. నేటి ప్రభుత్వం సబ్ స్టేషన్ ఆర్టిజన్ల, శ్రమనుగుర్తించిందని, 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాకు, కీలకపాత్ర వహిస్తున్నారని వీరికి తగినంత వేతనాలు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రస్తావన జరగడం ఆనందదాయకంగా ఉందని వారన్నారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ ఆర్టిజన్లో బాలేశం. రామచంద్రం. సుదర్శన్. బాల్ నర్స్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular