TEJA NEWS TV: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తారక రామ్ నగర్ కాలనీకి చెందిన బోయ పాలరాజు తన పుట్టినరోజును వైయస్సార్ నగర్ లోని హోసన్నా వృద్ధాశ్రమంలో ఉండే వృద్ధులు, పాఠశాల పిల్లల మధ్య జరుపుకున్నారు. అనంతరం వారి మధ్య పుట్టినరోజు కేకులు కట్ చేసి అందరికీ పంచి తన ఆనందాన్ని జరుపుకున్నారు అక్కడ ఉన్న వారంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఉన్న వృద్ధులకు అల్పాహారాన్ని పంపిణీ చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు జాన్ ప్రభాకర్ మాట్లాడుతూ పుట్టినరోజు అందరూ వారి కుటుంబ సభ్యులతో పెద్ద పెద్ద హోటల్లో లేదా ఆరాధకరమైన ప్రాంతాలలో ఎంతో ఖర్చుతో చేసుకుంటారని కానీ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాలరాజు మా వృద్ధాశ్రమంలో మా మధ్య జరుపుకుని మా హోసన్నా వృద్ధాశ్రమానికి బెడ్డు పరుపులు పంపిణీ చేయడం వారి మంచి వ్యక్తిత్వానికి నిదర్శనమని వారు వారి పిల్లలు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకులు ఆర్మీ రామయ్య, మద్దయ్య,బలరాముడు,తిరుపాలు,నాగరాజు,శేషు,మహేష్,హరి,యాగంటి,ప్రసాద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
డోన్: హోసన్నా వృద్ధశ్రమానికి బెడ్డు మంచం పంపిణీ చేసిన పాల రాజు
RELATED ARTICLES