TEJA NEWS TV : మహిళా దినోత్సవం సందర్భంగా డోన్ డివిజన్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వారు నలంద హై స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో మహిళా మణులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీమతి పద్మావతి గారు (మాజీ కౌన్సిలర్), శ్రీమతి భారతి గారు (ఆటో కార్మికురాలు), శ్రీమతి పద్మ కుమారి గారు (మహిళా పోలీస్), శ్రీమతి మౌలాబీ గారు (సచివాలయ వాలంటీర్) శ్రీమతి ఏస్తేరు గారు (సంఘ సేవకురాలు) గార్లను శాలువా, పూలమాల, మెమొoటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వక్తలు మహిళల ఆత్మ స్థయిర్యం గురించి, నేటి కాలంలో వారు రాణిస్తున్న విధానమును గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో *డోన్ డివిజన్ క్రిస్టియన్ జేఏసీ ప్రెసిడెంట్ ఆదామ్, వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ జాన్సన్ బాబు, కోశాధికారి యిర్మియా సభ్యులు కమలా జెస్సికా, అక్వినో, భారతి*, మేరీ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
డోన్ డివిజన్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవకార్యక్రమం
RELATED ARTICLES



