TEJA NEWS TV
కోయిలకుంట్ల మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తూన్న వెంకట్రామిరెడ్డి శుక్రవారం డోన్ డివిజన్ ఉపవిద్యాశాఖ ఆధికారిగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయనను డోన్ మండల ఆధ్యాపకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను పూలమాలలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డోన్ మండలం విద్యాశాఖ ఆధికారి ప్రభాకర్,ఉప విద్యాశాఖ ఆధికారి రామ నర్సప్ప, పాతపేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి,నెహ్రు నగర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబు,యుటిఎఫ్ నాయకులు ఎన్.ఎస్.బాబు, మాణిక్యం శెట్టి,లక్ష్మీ నాయక్ ,బివై సుబ్బారాయుడు,తదితరులు పాల్గొన్నారు.
డోన్ డివిజన్ ఉపవిద్య శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వెంకటరామిరెడ్డి
RELATED ARTICLES