వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని కట్టమల్లన్న చెరువు దగ్గర నిమర్జన ఏర్పాట్లు పరిశీలించి మైనింగ్,ఇరిగేషన్,మున్సిపల్ అధికారులతో సమీక్షించిన *కార్పొరేటర్ సుంకరి.మనీషా శివకుమార్*
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా లో ఎనిమిది ప్రాంతాలలో వినాయక నిమర్జనం జరుగుతుంది.అందులో ఒకటి మన కట్టమల్లన చెరువు. వినాయక నిమర్జన ఏర్పాట్లు ఎలాంటి లోటు పాట్లు లేకుండా మున్సిపల్ శాఖ ద్వారా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అన్నారు. గతంలో మాదిరి రెండు క్రేన్ లు అందుబాటులో ఉంటాయని,మున్సిపల్ సివిల్, ఇరిగేషన్,పోలీసు,ఎలక్ట్రికల్,మెడికల్,శానిటేషన్ అధికారులు,సిబ్బంది అందుబాటులో ఉండి వినాయక నిమజ్జనం సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ బీ ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు పోగుల.సంజీవ,కీర్తి నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గోరుకంటి.లక్ష్మణ్ రావు మరియు స్థానిక బీ ఆర్ యస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కట్టమల్లన్న చెరువు దగ్గర వినాయక నిమర్జన ఏర్పాట్లు పరిశీలించిన కార్పొరేటర్
RELATED ARTICLES