బీబీపేట్, జూన్ 23: డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీబీపేట్ మండలంలో బలిదాన దివస్‌ను భారతీయ జనతా పార్టీ ఘనంగా నిర్వహించింది. మండల అధ్యక్షులు అల్లం ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టికల్ 370 దేశాభివృద్ధికి అడ్డు అని, దాన్ని రద్దు చేయాలని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పోరాడినందుకే ఆయన సేవలను దేశం ఎప్పటికీ మరవదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రవీందర్ రాజ్, మండల ప్రధాన కార్యదర్శులు పిడుగు శ్రీనివాస్, తాళ్ల దేవరాజ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సూరు సురేష్, ఓబీసీ మండలాధ్యక్షుడు లక్కర్సు మహేందర్ వర్మ, యాడారం గ్రామ అధ్యక్షుడు బట్టు భరత్ రాజ్, మెట్టు రవి, బట్టుపల్లి రాము, వడ్నాల రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన దివస్
RELATED ARTICLES