కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని నర్సింగ్ రావ్ పల్లి గ్రామంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రోసిడింగ్ పత్రాలను గ్రామ సర్పంచ్ సాయిలు అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చుటకు ముఖ్యమంత్రి కేసీఆర్ గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ఒక వరం లాంటిదని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు దత్తారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విట్టల్, సుదర్శన్ రెడ్డి, రామ్ రెడ్డి, బొజ్జ బాలయ్య తదితరులు పాల్గొన్నారు
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్దిదారులకు అందజేసిన సర్పంచ్
RELATED ARTICLES



