TEJA NEWS TV
మడకశిర ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో డిప్లొమా కోర్సు చదువుతున్న కొంకల్లు గ్రామానికి చెందిన శివన్న,మంజుళ దంపతుల రెండవ కుమారుడు జనార్దన్ ఇటీవల నంద్యాల జిల్లాలోని మహానంది వ్యవసాయ విశ్వవిద్యాలయం లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో టేబుల్ టెన్నిస్ క్రీడల్లో విజేతగా నిలిచి బహుమతి ని అందుకున్నారు.జనార్ధన్ ను మడకశిర ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు అభినందించారు.ఈ సందర్భంగా జనార్దన్ తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అబ్బాయి విజేతగా నిలవడానికి కారణమైన మడకశిర ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ సరోజినీ దేవి, ఫిజికల్ డైరెక్టర్ రమేష్,అశిస్ కమల్ కు కృతజ్ఞతలు తెలిపారు.
టేబల్ టెన్నిస్ విజేతగా కొంకల్లు జనార్దన్
RELATED ARTICLES