TEJA NEWS TV
కర్నూలు జిల్లా కోసిగి మండలం చిన్నబూంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.ప్రజా సమస్యలపై సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినందుకు.టిడిపి కార్యకర్త లక్ష్మన్న మరియు భార్య హైమావతి పై వైసిపి నాయకులు దాడి చేశారు
గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కొలిమి లక్ష్మన్న. హైమావతి దంపతులపై వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ కే. చిన్నహుశేనీ తదితరులు బుధవారం అర్ధరాత్రి దాడి చేశారు. గ్రామానికి చెందిన గంగి హుశేనీ, కల్లూరు లక్ష్మయ్య, పుడితిని సోమిరెడ్డితో, సర్పంచ్ చిన్న హుసేసీ కలిసి లక్ష్మన్న, హైమావతి దంపతుల ఇంటి గేటును బైక్తో ఢీకొట్టి, ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కట్టెలతో దాడి చేశారు. వైసీపీ నాయకుల చేతుల్లో దెబ్బలు తింటున్న దంపతులను చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. చిన్నభూంపల్లి గ్రామంలో సర్పంచ్పై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకే మనసులో పెట్టుకుని తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు. తమ ఇంటి మీద వైసీపీ నాయకులు దాడి చేయడానికి తీసుకొచ్చిన బైక్ ను అక్కడే వదిలి పారిపోయారని కోసిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాయపడిన వారిని 108లో వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుల దాడి
RELATED ARTICLES