

TEJANEWSTV
ఈడిగ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు
కర్నూలు జిల్లా
హొళగుంద:-ఈరోజు
దేవరగట్టు మళ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, మాజీ టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం ప్రసాద్ లను ఈడిగ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పూలమాల తో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం టీడీపీ పార్టీల వర్గాలకు తావు లేకుండా అందరిని కలుపుకొని పార్టీ కి పూర్వ వైభోగం తీసుకొస్తామని వారు తెలిపారు . టీడీపీ కార్యకర్తలు ఏ పని ఉన్న తమను నేరుగా సంప్రదించాలని కోరారు. త్వరలో నియోజకవర్గం లోని అన్ని మండలాలు, గ్రామాలకు వెళ్లి నాయకులు, కార్యకర్తలను ఒకే తాటిపైకి తీసుకొస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ వీరన్న గౌడ, రాజేంద్ర గౌడ, గుబ్బళి లక్ష్మయ్య, అయ్యాలప్ప, దిడ్డి నాగప్ప,గజ్జెహళ్లి గిరి మల్ల, పూజారి పోతప్ప, వందవాగాలి కరిలింగ, గోనెహల్ వీరనాగప్ప, ముద్దటామాగి తిమ్మారెడ్డి, బొజ్జన్న, దుర్గన్న, కొగిలాతోట రంగ, పెద్ద వీరేష్, చిన్న వీరేష్, రంగస్వామి పాల్గొన్నారు.



