టీటీడీ లో 700పోస్టులు భర్తీలో తెలుగు ప్రాంత బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు బ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు కె.పి.వి.సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆళ్లగడ్డలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ… తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పారాయణ దార్ పోస్టులు భర్తీకి టీటీడీ చర్యలు చేపట్టడంతో బ్రాహ్మణులలో ఆశలు ఉండేవని ,అయితే డిప్యూటీ ఈ వో మరియు కార్యాలయ ఓఎస్ డి గోవిందరాజన్ గోల్ మాల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివిధ మాద్యమాలలో వార్తలు రావడంతో బ్రాహ్మణులలు ఆందోళన చెందు తున్నారని ఆయన పేర్కొన్నారు. చైర్మన్ ప్రకటనలకు విరుద్ధంగా చర్యలుతీసుకుంటున్నట్లు తెలియవచ్చిందని వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలనిగోవిందరాజన్ మరియు పనియగ్నేశ్వర్ యాజులును తొలగించి నిజాయితీ అధికారులను నియమించి ప్రక్రియ జరపాలని, తెలుగు బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా చూడాలని కూడా వారు కోరారు.
టీటీడీ వేద పారాయణ పోస్టులు భర్తీ లో తెలుగు వారికీ ప్రాధాన్యత ఇవ్వాలి
RELATED ARTICLES