TEJA NEWS TV :ఆళ్లగడ్డ పట్టణంలోని శిల్పా నేచర్ హోమ్స్.. రోటరీ ఆరోగ్య వేదిక ఆవరణలో జోష్ ఆళ్లగడ్డ పేరుతో ఏర్పాటుచేసిన ఏరోబిక్స్ వ్యాయామ శిబిరాన్ని ఆదివారం ఉదయం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో తైక్వాండో, యోగ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి మాట్లాడుతూ.. నేటి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జోష్ ఆళ్లగడ్డ పేరుతో పట్టణంలో ఆరోగ్యాభిలాషుల కోసం డాక్టర్ రాంగోపాల్ రెడ్డి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ప్రసాద్ క్లాపింగ్ థెరపీ శిక్షణను ఇచ్చారు.
జోష్ ఆళ్లగడ్డ… వ్యాయామ శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
RELATED ARTICLES