తేజ న్యూస్ టివి ప్రతినిధి,
*గురువారం హనుమకొండ భవాని నగర్ లోని తన నివాసంలో ఆత్మకూరు, దామెర, గీసుగోండ, సంగెం మండలాలకు మరియు 15వ,16వ,17వ డివిజన్ లకు చెందిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి నిర్వహించారు.జూలై 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగనున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలన్నారుప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేయడానికి అవసరమైన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేసేందుకు కృషి చేయాలి అని ఆయన అన్నారు.
జూలై 4 వ తేదీ ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి అధ్యక్షుల సభను విజయవంతం చేయాలి
RELATED ARTICLES