భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
జూలూరుపాడు: జూలూరుపాడు పత్తి మార్కెట్ యార్డ్లో పత్తి రైతుల సమస్యలపై రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరియు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. పత్తి రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్షను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ప్రారంభించినట్టు నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, లాకవత్ గిరిబాబు, చపాలమడుగు రామ్మూర్తి, భూపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు మార్కెట్‌ను పరిశీలించి రైతులు మద్దతు ధర అందుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. తేమశాతం పేరుతో తక్కువ ధర ఇస్తున్నారని, మార్కెట్లో నిలువు దోపిడీ జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్ యాప్పై రైతులకు అవగాహన లేకపోవడం, మార్కెటింగ్ శాఖ అధికారులు సరైన మార్గదర్శకం ఇవ్వకపోవడం కూడా సమస్యగా నాయకులు పేర్కొన్నారు.
జూలూరుపాడు: రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన
RELATED ARTICLES



