
TEJA NEWS TV : మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు నషా ముక్త్ భారత్ లో భాగంగా కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు ఆంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడమైనది. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు అనేవి మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు వ్యసనం యొక్క ప్రమాదాల గురించి విద్యార్థిని విద్యార్థులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమం, ఈ కార్యక్రమాలు తరచుగా యువత తల్లిదండ్రులు మరియు సమాజాలను లక్ష్యంగా చేసుకొని మాదకద్రవ్యాల వాడకాన్ని నిరోధించడానికి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఎలా ఉండాలో సూచించారు, అలాగే మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రమాదాలు మరియు పరిణామాల గురించి తెలియజేశారు. దీనిలో భాగంగా గోడ పత్రికలను జూనియర్ కాలేజీ గోడలపై అంటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు బాల నర్సింలు, కిరణ్ కుమార్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, లెక్చరర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.