TEJANEWSTV
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని A.M. లింగన్న మెమోరియల్ హైస్కూల్ (సేవామందిర్) నందు నిన్న నిర్వహించిన జిల్లా స్థాయి అబాకస్ & వేదిక్ మ్యాథ్స్ పోటీలలో గుడిబండ మండలం, సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ పోటీలలో సెయింట్ మేరీ పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థి యు. వివేకానంద (U. Vivekananda) తన అద్భుతమైన ప్రతిభతో జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి (Second Prize) సాధించాడు. ఈ విజయంతో వివేకానంద రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించడం మన పాఠశాలకు మరియు మండలానికి ఎంతో గర్వకారణం అని ఉపాద్యాయులు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ బృందం మరియు వివేకానంద తల్లిదండ్రులు అతడిని అభినందిస్తూ, రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా విజయం సాధించి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
వివేకానందకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.




