TEJA NEWS TV : ఆదోని జనసేన పార్టీ కార్యాలయంలో జనం కోసం జనసేన కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ నాయకులు గాజుల రాజశేఖర్, పులి రాజు, నెల్లిబండ రాజశేఖర్ , ఆరిఫ్ మాట్లాడుతూ జనసేన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం కోసం ప్రతి గ్రామంలో జనం కోసం జనసేన అనేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలను పార్టీ విధివిధానాలను జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏరకమైనటువంటి పరిపాలన అందిస్తుంది అనే విషయంపై ప్రజలకు వివరిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సంబంధిత అధికారులకు ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఆ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఏ గ్రామంలో చూసిన త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా కులమైందని అన్నారు. పూర్తిగా ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం గా ఆగిపోయిందని అభివృద్ధి అనేటువంటి ఊసే లేనటువంటి పరిస్థితి ఉంది కనీసం ఐదు సంవత్సరాలలో పేద ప్రజలకు ఇంటి స్థలం ఇల్లు నిర్మించి ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రజలందరూ అభివృద్ధి వైపు రావాలని కోరారు. నాయకులు ప్రకాష్ , యం. తాహేర్ వలి శ్యామ్, ఉరుకుందు, విజయ్, శ్రీనివాస్, నాగరాజు, ఈరన్న, అయ్యప్ప, మహేంద్ర, గౌస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ బలోపేతం కోసం జనం కోసం జనసేన కరపత్రాలు విడుదల
RELATED ARTICLES