భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం :
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) వందేళ్లైనా ప్రజాదరణ తగ్గకుండా అజేయంగా నిలిచిందని, ప్రజా ఉద్యమాలతో మరో వందేళ్లైనా ముందుకు సాగుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా అన్నారు. సిపిఐ శతవసంతాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభను పురస్కరించుకుని చేపట్టిన ప్రచార జాతా బుధవారం చుంచుపల్లి మండలం గౌతంపూర్ సింగరేణి ప్రాంతానికి చేరుకుంది.
గౌతంపూర్ నుంచి కొత్తగూడెం బైపాస్ రోడ్డు వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, అటవీ హక్కుల చట్టాలు సిపిఐ పోరాట ఫలితాలేనని తెలిపారు. త్వరలో జరగనున్న కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
జనబలంతొ కొత్తగూడం కార్పొరేషన్, కైవాసం చేసుకుంటాం – సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా
RELATED ARTICLES



