బీబీపేట్ మండలం జనగామ గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వ హించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు, Dr.అబ్దుల్ మజీద్, మరియు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ హేమశ్రీ మాట్లాడుతూ రైతులు అందరూ ఈ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆవులు గేదెలు ఏవైనా కట్టనిచో వాటిని పరీక్షించి గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్స అందించడం జరిగింది మరియు లింగ నిర్ధారిత వీర్యము గురించి కూడా అవగాహన కల్పించారు. ఈ లింగ నిర్ధారిత వీర్యము వాడడం వలన 90% ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని తెలిపారు దీనికిగాను రైతు వాటా 250 రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఒకే పశువుకు వరుసగా రెండు ఎదలలో లింగ నిర్ధారిత వీర్యము వాడిన చూలు కట్టకపోతే రైతు వాటా 500 రూపాయలు రైతు అకౌంట్ కు వాపస్ ఇవ్వబడును. ఈ శిబిరంలో దాదాపు 38గేదెలు 12 ఆవులకు చికిత్స చేయడం జరిగింది. కృత్రిమ గర్భాధారణ 8 మరియు40 దూడలకు నట్టల నివారణ నివారణ మందు నివారణ మందు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీబీపేట్ పశు వైద్య అధికారిని డాక్టర్ హేమాశ్రీ మరియు డాక్టర్ రాంచందర్ గారు , DLDA సూపర్వైజర్ కృష్ణ మరియు గోపాల మిత్రులు విజయ్,రాము పశువైద్య సిబ్బంది శ్రీరాం , రాజయ్య , మరియు గ్రామస్తులు మరియు రైతు సోదరులు అందరు పాల్గొనడం జరిగింది.
జనగామ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం
RELATED ARTICLES