తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, తడ మండలం, అండగుండల గ్రామంలో చేనేతలు మన్నెముద్దు శ్రీనివాసులు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా చేనేత నాయకులు గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ ఒంటిమిట్ట చేనేత కార్మిక కుటుంబం ఆత్మహత్యకు పాల్పాడడానికి కారణం ఐన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు.చేనేతలే కాకుండా సమాజంలో ఇలాంటి సమస్యలు అనేక చోట్ల కనబడుతుందని,సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని పొందాలని,సమస్యలను స్థానిక సంఘాల దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారం కొఱకు కృషి చేసుకోవాలి అని అన్నారు.సమస్యలు తలెత్తినపుడు ఆత్మహత్యకు పాల్పడవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో పిచ్చిక చిన కుప్పయ్య,పెరిశెట్ల శ్రీనివాసులు, గుత్తి తుకారాం,గుత్తి శివకుమార్, గట్టు షణ్ముగం,యారాశి బాలకృష్ణయ్య,సీతా చెంచుకృష్ణ,తదితర చేనేత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.
చేనేతల ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలి : చేనేత నాయకులు గుత్తి త్యాగరాజు డిమాండ్
RELATED ARTICLES