హోలీ వేడుకలు మండల వ్యాప్తంగా రంగు రంగులతో సంబురంగా జరిగాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామ, పట్టణ కేంద్రం లో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు జరుపుకున్నారు, హోలీ సంబరాల్లో పెద్ద చిన్న బేధం లేకుండా ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకొని తమ సంతోషాన్ని వెలబుచ్చుకున్నారు. చేగుంట పట్టణ కేంద్రం లో జరుపుకున్న హోలీ సంబరాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, తాజా మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్ , అయిత పరంజ్యోతి, అయిత రఘరాములు, చల్ల రామకృష్ణ, లక్ష్మణ్, నాగార్జున, లక్ష్మణ్ గౌడ్, శంకర్ చారి చిన్నారులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మండల కేంద్రంతో పాటు చందాయిపెట్, మక్కారాజ్ పెట్, బోనాల, ఇబ్రహీంపూర్, రాంపూర్, చిన్న శివనూర్,గ్రామాల పరిధిలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ కార్యక్రమం లో ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచ్ లు, వివిధ పార్టీ ల నాయకులు, యూవకులు తదితరులు పాల్గున్నారు,
చిన్న పెద్ద భేదం లేకుండా హోలీ వేడుకలు జరుపుకున్న యువకులు
RELATED ARTICLES