దసరా నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని శ్రీ వెండి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయలో సరస్వతి మాత అలంకారంలో ఉన్న అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), శ్రీదేవి (అమ్మాజీ) దంపతులు దర్శించుకున్నారు.
_ఈ సందర్భంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయాలలో ఉత్సవ మూర్తి ప్రాంగణ వేదికలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య దంపతులు పాల్గొని చిన్నారులతో అక్షరాలను దిద్దించారు._
_అనంతరం ఎమ్మెల్యే తాతయ్య గారు మాట్లాడుతూ చిన్నారులకు విద్యను అందిస్తూ మంచి ఉజ్జోల భవిష్యత్తు అందించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు._
_మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న విశేష పూజలు ఆధ్యాత్మి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రైవేటు కమిటీ ప్రతినిధులు అమ్మవారి జ్ఞాపిక శేష వస్త్రాన్ని ప్రసాదాలను అందజేశారు.
చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), శ్రీదేవి (అమ్మాజీ) దంపతులు
RELATED ARTICLES



