కర్నూలు జిల్లా ఆలూరు తాలుక్ హొళగుంద మండలం చిన్నహ్యేట గ్రామం నందు రైతుల ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా రెవిన్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్ తెలిపారు.చిన్నహ్యేట గ్రామం నందు గ్రామ సర్పంచ్ హేసన్ అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈకర కార్యక్రమంలో డిపిఓ అధికారి ముఖ్య అతిధి ప్రత్యేక అధికారిగా హాజరైనా జిల్లా పంచాయతీ అధికారి సదస్సులో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రెవిన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.చిన్నహ్యేట గ్రామం నందు భూ సమస్యలు ఉన్నాయని మ్యూటేషన్ కుటుంబ సభ్యుల ఆస్తి భాగాల పరిష్కారం. సర్వే మరియు పాసు బుక్కలు ఆన్లైన్ అడంగల్ సమస్యలు అర్జీల రూపంలో గ్రామంలలోకె ప్రభుత్వ యంత్రాంగం వచ్చి గ్రామ సభలను నిర్వహించి. ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరిగిందని వారు తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో ఏడు అర్జీలు వచ్చారని వారు తెలిపారు. అర్జీదారులకు రసీదును అందించి సంబంధిత పత్రాలను పరిశీలించి పరిష్కార మార్గం చూపుతామన్నారు. గ్రామ ప్రజలు వడ్డే బీమా. ప్రకాష్ గ్రామంలో కోతులు కుక్కలు బెడదలను నివారించాలని జిల్లా గ్రామపంచాయతీ అధికారికి వినతి పత్రం అందించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోడిప్యూటీ తాసిల్దార్ నిజాముద్దీన్. మండల విస్తరణ అధికారి చక్రవర్తి. డిఎస్ భాష. పంచాయతీ సెక్రెటరీ. వీఆర్వోలు. సచివాలయం సిబ్బంది ప్రజలుఅందరూ పాల్గొన్నారు.
చిన్నహ్యేట గ్రామం నందు రెవెన్యూ సదస్సు
RELATED ARTICLES