భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించేలా మన సమాజంలో అనేక సంఘటనలను మనం చూస్తుంటాము. అలాంటి సంఘటనే కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కోసిగి గ్రామం సిద్ధప్ప పాలెంకు చెందిన వక్రానీ గోవిందు కుమారుడు వక్రాని శ్రీనివాసులు అనే హిందూ సహోదరుడు తన తల్లి వక్రాని అయ్యమ్మ కు చిన్ననాటి స్నేహితురాలు అయిన ఖాజాభీ అనే 105 సంవత్సరాల ముస్లిం మహిళ ఈ రోజు చనిపోవడం తో ఆమెని కూడా తన సొంత తల్లిగా భావించిన వక్రానీ శ్రీనివాసులు వారి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. తమ మధ్య ఎటువంటి కులమతాల విభేదాలు లేవని చనిపోయిన ఖాజాబీ తనను చిన్న తనం నుండి సొంత కుమారునిగా భావించి ఆదరించింది అని వారి తరం గతించినా ఇప్పటి తరం లో కూడా మా మధ్య ఉన్న స్నేహం కొనసాగిస్తామని ఆమె కుమారులు కూడా తనకు సొంత తమ్ముళ్లు వంటివారనీ భావించి వారికి అన్ని విధాల అండగా ఉంటామని చనిపోయిన తన తల్లి ఖాజబి ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నామని ఈ సందర్భంగా వక్రానీ గోవింద కొడుకు వక్రానీ శ్రీనివాసులు అన్నారు.
చనిపోయిన కుటుంబానికి ఆపన్న హస్తం
RELATED ARTICLES