జూబ్లీహిల్స్ – ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రమణ, బానోతు చందన(25)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
రమణ సినిమా నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్ పనిచేస్తుండగా, చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్ లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు.
ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడగా, చందన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చట్నీ విషయంలో గొడవ.. ఉరేసుకుని చనిపోయిన బండ్ల గణేష్ డ్రైవర్ భార్య
RELATED ARTICLES