Saturday, January 10, 2026

చంద్రుగొండ: బెండాలపాడు గ్రామ పంచాయతీ నూతన సర్పంచిగా బొర్రా లలిత , ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ
22- 12- 2025
చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పంచాయతీ నూతన సర్పంచిగా బొర్రా లలిత , ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, ఎం.పి.ఓ ఖాన్  బొర్రా లలిత తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎం.పి.ఓ ఖాన్ గారు మరియు పంచాయతీ కార్యదర్శి రోహిత్ కుమార్ ని శాలువాతో సత్కరించారు.

ఈ సత్కార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అశ్వరావుపేట నియోజకవర్గ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి , దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేష్  పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలు, ఆలకుంట రాందాస్, లక్ష్మణ్, ఓర్సు రామకృష్ణ, గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular