భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, స్థానిక ఎస్సై మాచినేని రవి, విజయవాడ నుండి భద్రాచలం వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం రాత్రి 8:30 గంటలకు జాతీయ రహదారిపై వెళ్లి వాహనాలను హాపీ పరిశీలించారు. అనంతరం జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పోలీస్ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎలాంటి ఆధారాలు లేని లక్ష రూపాయల పైన ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. అట్టి డబ్బులను ఆధారాలతో తిరిగి పొందవచ్చునని అన్నారు.
చండ్రుగొండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోవాహనాలు విస్తృత తనిఖీ
RELATED ARTICLES