భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ.
29-3-2025
చండ్రుగొండ, మార్చి 29:
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చండ్రుగొండ మండలం కేంద్రంలోపార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా జరుపుకున్నారు. మండల అధ్యక్షులు సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు.
ఎన్టీఆర్ సేవలను కొనియాడిన నేతలు
సత్యనారాయణ మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవం కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఈ 43 ఏళ్లలో పార్టీ ప్రజల హృదయాల్లో స్థిరపడిందని అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా 9 నెలల్లోనే పటేల్-పట్వారి వ్యవస్థను రద్దు చేయడం, పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం అందించడం, సంక్షేమ పాలనను అమలు చేయడం వంటి చిరస్మరణీయ నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి, మండలస్థాయి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వారిలో:
కొదుమూరి సత్యనారాయణ, (జిల్లా అడ్డా కమిటీ సభ్యుడు)
చాపలమడుగు వెంకటేశ్వర్లు, (ప్రధాన కార్యదర్శి)
నల్లమోతు జగదీష్,
బెల్లంకొండ పరమేశ్వరరావు,
దడిగల మల్లేష్,
చిట్లూరి రామారావు,
కిలారి ప్రసాదు,
రాచర్ల వెంకటేశ్వర్లు,
నెక్కడుపు రామారావు,
పద్దం వెంకటి,
భేతి సోమయ్య,
బేతి కృష్ణార్జునురావు,
నారపుగు రాంబాబు,
జి. బాలు తేజ కిరణ్,
లాల్ మహమ్మద్, నాగరాజు, తదితరులు ఉన్నారు.
పార్టీకి మద్దతుగా నినాదాలు
నాయకులు, కార్యకర్తలు “తెలుగుదేశం జిందాబాద్”, “ఎన్టీఆర్ అమర హై”, “చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేశారు. పసందైన వాతావరణంలో వేడుకలు ముగిశాయి.
చండ్రుగొండ మండలంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES