ఆంద్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ) 67 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు,రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ నాయకులు రాజేష్, జిల్లా సెక్రటరీ వేమిరెడ్డి వెంకటరెడ్డి, సూర్య స్టాఫ్ రిపోర్టర్ ఎమ్ ఎ ఖాజా సూర్య దినపత్రిక పాత్రికేయులు ఇమాం జానీ జిల్లావాణి పాత్రికేయులు తమ్మిశెట్టి కాశీ విశ్వనాధ్, ఆంధ్రప్రభ పాత్రికేయులు ఖుద్దూస్,వనిత పాత్రికేయులు గాడిపర్తి సీతారామ్ ISR 9 పాత్రికేయులు ఇక్భాల్ పాత్రికేయులు జాన్,గౌతమి న్యూస్ రిపోర్టర్ రాజు మరికొంత మంది మీడియా మిత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర యూనియన్ నాయకులు రాజేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 11 ఏళ్లకే ఈ యూనియన్ ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. జర్నలిస్టుల సమస్యలు గత కొంతకాలంగా వింటూనే ఉన్నానని,
నందిగామ నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు. ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
ఘనంగా నందిగామ APUWJ 67వ వార్షికోత్సవ కార్యక్రమం
RELATED ARTICLES