గుంటూరు పల్లి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా గుంటూరు పల్లి గ్రామంలోనీ రామాలయం ప్రధాన అర్చకులు శ్రీ బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీనివాస చారి మరియు హనుమాన్ దీక్ష స్వాములు మొగసాని యాకయ్య, యారము సుబ్బారావు, వీరేశ్,కొంగర భద్రయ్య,యామని వినోద్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారి శోభ యాత్ర మరియు పల్లకి సేవ నిర్వహించడం జరిగింది..కార్యక్రమంలో గోపాలపు రాధాకృష్ణ,ఆళ్ళ వీర భద్రయ్య,దండా నరేష్, కాండ్రు వకీల్ రావ్,పాతూరి రామారావ్,వినోద్,కందిమల్ల శ్రీకాంత్,చాగంటి వెంకటేశ్వర్లు,మరియు గుంటూరు పల్లి గ్రామ ప్రజలు,మహిళలు,యువకులు అందరూ పాల్గొనడం జరిగింది.ఆలయ అర్చకులు శ్రీనివాసాచారి మాట్లాడుతూ సీతారాముల వారి మరియు ఆంజనేయ స్వామీ వారి కరుణ కటాక్షాలతో శనివారం రోజు ఎండ తీవ్రత తక్కువగా ఉన్నందున కార్యక్రమం దిగ్విజయంగా సాగింది అని అలాగే ఆ రామ చంద్రుని చల్లని దీవెనలతో త్వరలో చేపట్ట బోవు గుంటూరు పల్లి గ్రామంలోని ఆంజనేయ సహిత సీత రామచంద్ర దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తికావాలని ఆకాంక్షించారు.
ఘనంగా ఆంజనేయ స్వామి శోభయాత్ర పల్లకి
RELATED ARTICLES