హోళగుంద మేజర్ గ్రామ పంచాయతీ కార్యలయంలో జూనియర్ ఆసిస్టెంట్ (ఎఫ్ఎసి) పంచా యతీ కార్యదర్శిగా పని చేస్తున్న బళ్లారి రాజశేఖర్ గౌడ గ్రేడ్ -3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పోందారు. ఈ సందర్భంగా గురవారం మండల పరిషత్ కార్యలయంలో ఎంపిడిఒ విజయలలిత, రాజశేఖర్డను సత్కరిస్తున్న ఎంపిడిఒ, గ్రామ కార్యదర్శులు ఈఓపిఆర్డీ చక్రవర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శులు రంగస్వామి, నాగరాజు, రాజ్‌కు మార్, నాగరాజు, ఉమామహేశ్వరి, లోకేశ్, మండల పరిషత్ సిబ్బంది గోవిందు,బసవ, శేక్షా వలి పదోన్నతి పొందిన రాజశేఖర్ గౌడకు శాల్వను కప్పి పూలమాలను వేసి ఘనంగా సత్కరించారు. ఎంపిడిఒ మాట్లాడుతు మేజర్ గ్రామ పంచాయతీలో ఏడు సంవత్సర కాలం లో పనిచేస్తూ ఉదయము ఐదు గంటలకే వచ్చి సిబ్బందితో మాట్లాడి ఏరియా వైజ్ గా పంపిస్తూ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ గ్రామ ప్రజలకు ఎల్లావేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామంలోని అలుపేరగని మీ సేవలను అందించారని కొనియాడారు. ఉద్యోగ పూర్తీ కాలం నాటికి ఇలాంటి ఉన్నత పదోన్నతి పదవులను మరెన్నో పోందా లని ఆకాంక్షించారు. తోటి గ్రామ కార్యదర్శులు సిబ్బంది అందరూ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శిగా ఘనత రాజశేఖర్ గౌడ – సన్మానించిన ఎంపిడిఒ గ్రామ కార్యదర్శులు
RELATED ARTICLES



