భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ, నవంబర్ 05. అశ్వరావుపేట నియోజకవర్గంలోని చండ్రుగొండ గ్రామ పంచాయతీ ఉత్తరపొంటూ కాలనీకి చెందిన చిద్దెల రమణ కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹60,000 వేల రూపాయల చెక్కు మంజూరైంది.
అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, అందుబాటులో లేకపోవడంతో, ఆయన ఆదేశాల మేరకు చండ్రుగొండ కాంగ్రెస్ కార్యాలయంలో గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మలపల్లి సురేష్, రమణకి చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సారేపల్లి శేఖర్, మాజీ సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అన్వర్ హుస్సేన్, చాపలమడుగు మనోహర్, కడియాల పుల్లయ్య, బడుగు చిన్న ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మలపల్లి సురేష్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
RELATED ARTICLES



