ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఎంపీడీవో ఆర్.వి.ఎస్.హెచ్.వి.యం. ప్రసాదరావు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాను కారణంగా గ్రామాల్లో ఎక్కడైనా బురద, చెత్త పేరుకుపోయి ఉంటే వెంటనే తొలగించాలన్నారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యలపై వెంటనే స్పందించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.
గ్రామాల్లో పరిశుభ్రత, ప్రజా సేవకు ప్రాధాన్యం ఇవ్వాలి – ఎంపీడీవో ప్రసాదరావు
RELATED ARTICLES



