భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 11.04.2025
స్థలం: గౌతాపురం – బూర్గంపహాడ్ మండలం
90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో – రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుహాజరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ సౌజన్యంతో బూర్గంపహాడ్ మండలంలోని గౌతాపురం ఆర్.అండ్.బి రోడ్ నుండి సోంపల్లి జడ్పీ రోడ్ వరకు, సుమారు రూ.90 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బి.టి. రోడ్‌కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖామంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బూర్గంపహాడ్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు హాజరై, కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు:
పంచాయతీరాజ్ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
—
గౌతాపురం – సోంపల్లి బి.టి. రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన
RELATED ARTICLES