ఆంధ్రప్రదేశ్ గౌడ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన వీరంకి గురుమూర్తిని విజయవాడ కృష్ణా జిల్లా ఆటోనగర్ లోని జిల్లా టిడిపి కార్యాలయం నందు టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా గజమాల శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి బెస్త సాధికార కమిటీ రాజంపేట జిల్లా అధ్యక్షులు బొంబాయి దుర్గా,డోన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి.మధుసూదన్ రెడ్డి,బీసీ నాయకులు సూరి,టిడిపి బెస్త సాధికార కమిటీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పీజీ. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తికి ఘన సన్మానం
RELATED ARTICLES