ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాగా గ్రామానికి చెందిన వాడిగా గుర్తింపు.
గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి గోదావరి నది ప్రవాహం ఉధృతం అవడంతో గల్లంతైనట్టుగా సమాచారం.
స్థానికుల వివరణ ప్రకారం ఈ ఘటన మధ్యాహ్నం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
గల్లంతైన వ్యక్తి బానారి రాజు 45 గా గుర్తింపు.
స్థానికుల సమాచారం తో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన మండల పోలీస్ యంత్రాంగం.
మధ్యాహ్నం ఒంటిగంట నుండి 8:30 వరకు కూడా దొరకని గల్లంతైన రాజు ఆచూకీ.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి,.
ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.