
TEJA NEWS TV :
సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చేతుల మీదుగా చాత్రాలయ పురస్కారం అందుకున్న గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి
సుచరిండియా ఫౌండేషన్ వారి సారధ్యంలో సి.వి రామన్ సైన్స్ ఒలంపియాడ్ అసోసియేషన్ వారు హైదరాబాద్ నగరం రవీంద్ర భారతి నందు నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి కి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సుచరిండియా ఫౌండేషన్ చైర్మన్ లయన్ కిరణ్ కుమార్ , సినీ నటుడు అడవి శేషు చేతుల మీదుగా చాత్రాలయ పురస్కారాన్ని అందుకున్నారు. గత 22 సంవత్సరాలుగా విద్యారంగంలో విద్యార్థులను జాతీయ, రాష్ట్ర స్థాయిలో మాథ్స్, సైన్స్ రంగాలయందు విజ్ఞులుగా తీర్చిదిద్దుతున్నందుకు వారి విజ్ఞాన తృష్ణ నిదర్శనముగా చాత్రాలయ పురస్కారాన్ని అందజేసి వారి విజయాలను ప్రశంసించారు.



