TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మోరుబాగల్ చెరువును తహశీల్దార్ శ్రీధర్ వీఆర్వోమరియు వీఆర్ఏ లతో సందర్శించిన ఆయన, రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున,మండల ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ మూడు రోజులు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అని అధికారికంగా కూడా చెప్తున్నారు కాబట్టి,మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా పాత ఇళ్లలో ఉండకూడదు. అలాగే పొలాలకు వెళ్లిన వాళ్ళు సాయంత్రం 5 గంటలకు అంతా ఇల్లు చేరుకోవాలి.అలాగే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి కరెంట్ తీగలతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లి తీసుకురావాలి ఎందుకంటే, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వర్షాలు ఎక్కువైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి అని తెలిపారు.
గుడిబండ: రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
RELATED ARTICLES



