Wednesday, November 19, 2025

గుడిబండ మండలంలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్  రెండవ విడత విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు,టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి.

TEJANEWSTV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం దేవర హట్టి గ్రామంలో రైతులతో కలిసి అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ రెండవ విడత విడుదల కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో ఏ ప్రభుత్వము చేయనంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల హామీలన్నింటిని నెరవేర్చి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండవ విడత డబ్బులను రైతన్నల ఖాతాలో కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగింది. దేశంలో రైతుల పట్ల ఏ ప్రభుత్వము తీసుకోనంత ముందు చూపు వరదలు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవడం వంటి కార్యక్రమాలు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది , తడిసిన ధాన్యాలను వెంటనే కొనుగోలు చేయడం పత్తి రైతులకు 24 గంటల్లో వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేయడం వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడం కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో హంద్రీనీవా సృజల స్రవంతి కృష్ణ జలాలను చెరువులకు నింపి వ్యవసాయ రైతులను ఆదుకోవడం జరుగుతా ఉంది. ఒక్క రైతులను ఆదుకోవడం కోసం మడకశిర ప్రాంతమైన అమరాపురం లో ఒక్క మార్కెట్ ఏర్పాటు చేయడం ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం గురించి ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది, మడకశిర నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ భూ సమస్యల మీద పెనుగొండ ఆర్డిఓ కార్యాలయానికి వెళ్లకుండా మడకశిరకు ఆర్డిఓ కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది రైతులకు మంచి వార్త, గతంలో ఇక్కడి నుంచి మంత్రులుగా పనిచేసిన మడకశిరకు ఆర్డిఓ కార్యాలయాన్ని తేలేకపోయారు, అదేవిధంగా హంద్రీనీవా జలాలు చరిత్రలో ఎన్నడు లేనివిధంగా అమరాపురం చివర ఉన్న చెరువుకు నీళ్లు తీసుకో రాబోతున్న ము , మడకశిర ,గుడిబండ, ఆగళి ,రోళ్ళ ,ఆమరాపురం మండలాలకు సాగునీరు తాగునీరు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. తాగు నీటి సమస్య అత్యధిక ఉన్న ఈ ప్రాంతంలో హంద్రీనీవా జలాల ద్వారా భూగర్భ జలాలు అభివృద్ధి చెంది బోర్లలో నీటిమట్టం పెరగడం జరుగుతుంది , ఎప్పటినుంచో ఉన్న తాగునీటి సమస్యను అధిగమించే విధంగా ప్రణాళికలు రూపొందించి పనిచేస్తున్నాం. గత వైసిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని చిత్తశుద్ధి ఉంటే హంద్రీనీవా కాలువలో పూడికతీత కంపచెట్లు తొలగించడం వంటి కార్యక్రమాలు ఒక్కచోట కూడా చేయకుండా నిరుపయోగంగా వదిలేయడం జరిగింది వారు సక్రమంగా పనిచేసే ఉంటే ఇప్పుడు సమయానికి కాలువ ద్వారా అన్ని చెరువులకు నీరు నింపే కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉండేది. కేవలం కలెక్షన్ల పైనే వైకాపా నాయకులు పడ్డారే తప్ప అభివృద్ధి కార్యక్రమాల వైపు చూడలేకపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, అన్ని మండల కన్వీనర్లు, సింగల్ విండో అధ్యక్షులు,  మార్కెట్ యార్డ్ చైర్మన్, అన్ని అనుబంధ సంఘాల నాయకులు క్లస్టర్ ఇన్చార్జులు ప్రధాన కార్యదర్శులు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular