శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ పీ హెచ్ సి లో ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్ వైజర్ కమలమ్మ ఆధ్వర్యంలో గర్భిణీలకు చిరుధాన్యాలు వాడకం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుడిబండ పీ హెచ్ సి మెడికల్ ఆఫీసర్ సౌందర్య మాట్లాడుతూ, గర్భిణీలు ప్రతి రోజూ మీ భోజనాల్లో చిరు ధాన్యాలు తప్పక ఉండేటట్లు చూసుకోవాలని, మీరు తీసుకునే ఆహారం క్వాలిటీతో ఉండాలని, అంగన్వాడీ లో ఇచ్చిన భోజనం తప్పక మీరే తినాలని అప్పుడు పోషక లేమి ఉండదని గర్భవతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గుడిబండ పీ హెచ్ సి మెడికల్ ఆఫీసర్ సౌందర్య, ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్ వైజర్ కమలమ్మ, మండలంలోని అన్ని అంగన్వాడీ కార్యకర్తలు గర్భవతులు పాల్గొన్నారు.
గుడిబండ పీ హెచ్ సి లో పోషణ పక్వాడా కార్యక్రమం
RELATED ARTICLES



