Thursday, March 13, 2025

గుడిబండ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

TEJA NEWS TV :


శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ ఉన్నత పాఠశాలలో విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడానికి, సమాజ సేవ,సామాజిక బాధ్యత పై అవగాహన కల్పించడానికి *అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి* అనే అంశం పై వ్యాసరచన పోటీలను పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సాయికృష్ణ నిర్వహించారు. జూనియర్ విభాగంలో వినూతన ఆలోచనలతో అద్భుతంగా వ్రాసిన P R చరిత, వందన, ఎలీషాసుహర్ష సీనియర్ విభాగంలో విద్య, భవ్యలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిచంద్ర కుమార్ బంగారు పతకాలు అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular