శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ తహశీల్దార్ కార్యాలయంలో ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని గుడిబండ తాసిల్దార్ శ్రీధర్ తెలిపారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో గురువారం ఆధార్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఆధార్ కార్డులో చేర్పులు మార్పులు పుట్టిన తేదీ తదితర వాటిని మార్పు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడడమే గాక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆధార్ సేవలను చేసుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొనే వారికి ప్రస్తుతం గుడిబండ తాసిల్దార్ కార్యాలయంలో నే ఆధార్ సేవలను ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. కావున పుట్టిన తేదీలు పేర్లలో చేర్పులు మార్పులు చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీధర్ తో పాటు డిప్యూటీ తహసిల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, భూ సర్వే డిప్యూటీ తాసిల్దార్ రాంభూపాల్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ కొంకల్లు రాజకుమార్, మీసేవ నిర్వాహకులు హనుమంత రాయుడు కరే లింగప్ప, తదితరులు పాల్గొన్నారు.
గుడిబండ: ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోండి – తహశీల్దార్ శ్రీధర్
RELATED ARTICLES



