శ్రీ సత్యసాయి జిల్లా, గుడిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నైపుణ్య ఆధారిత వృత్తి విద్యా శిక్షణ అందించారు. ప్రధానోపాధ్యాయుడు గోవిందప్ప ఆధ్వర్యంలో రిటైల్ వృత్తి విద్య, ఎలక్ట్రానిక్స్ వృత్తి విద్య అంశాలపై ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో PET అజార్, వృత్తి విద్య ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, సుష్మా సహకరించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఈ రంగాలలో కెరీర్ ఎంచుకోవాలని ఆలోచిస్తే దానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను పొందగలరని ప్రధానోపాధ్యాయుడు గోవిందప్ప తెలిపారు.



