TEJANEWSTV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల పరిధిలోని మద్దనకుంట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు పోతిరెడ్డి, నాగరాజు, రామాంజనేయులు,శ్రీహరి, కుమార్ లకు మరియు ఈ పాఠశాలకు నూతనంగా నియమించబడ్డ లీలావతి, కుళ్ళాయమ్మ, వీరాంజనేయులుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహమూర్తి, గుడిబండ మండలం ఈనాడు రిపోర్టర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఏ షబ్బీర్ ఆధ్వర్యంలో జరిగింది. ఉపాధ్యాయులను శాలువాలతో పూలహారాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి కమిటీ చైర్మన్ వీర ముద్దప్ప, గ్రామస్తులు క్రిష్టప్ప మూడ్లగిరియప్ప, నాగప్ప,గిరియప్ప ,వీరభద్రప్ప మరియు ఉపాధ్యాయులు అరుణ శివారెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
గుడిబండ:బదిలీ పై వెళ్ళిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
RELATED ARTICLES



